ప్రభాస్ న్యూ లుక్‌..

Prabhas’ new look for Saaho is out and it’s nothing like his Baahubali avatar
Prabhas’ new look for Saaho is out and it’s nothing like his Baahubali avatar

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు తన స్టైల్‌ని మార్చేసాడు. ప్ర‌స్తుతం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సాహో చిత్రానికి హెయిర్ స్టేల్‌ను మార్చేసిన ప్రభాస్.. తాజాగా సరికొత్త లుక్‌తో అదరగొడుతున్నాడు. రీసెంట్ ప్రభాస్ న్యూలుక్ స్టిల్ ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నది. ప్రభాస్ లవర్‌బాయ్‌లా కనిపించే ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ న్యూలుక్ ఏదైనా సినిమాకు సంబంధించింది అయి ఉంటుందని తెగ సంబరపడిపోతున్నారు. ఓ మేగజైన్ కోసం ప్రభాస్ న్యూస్టిల్ తీశారని తెలుస్తోంది.

Prabhas

సాహో చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముకేశ్‌ ఇందులో ప్రతినాయకుడు. కథానాయిక ఎవరన్నదీ ఇంకా ప్రకటించలేదు. ప్రభాస్‌కు జోడీ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.