‘సాహో’ కోసం భారీ ఛేజింగ్..

Prabhas Sahoo Movie Shooting in Abu Dhabi

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. బాహుబలి తరువత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.ఈ సినిమా ఎలా ఉంటుందా అని చాలా వరకు టాలీవుడ్‌పై ఓ కన్నేసి ఉంచుతున్నారు సినీ జనాలు. హిందీలో కూడా ఈ సినిమా రూపొందుతుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ మళ్లీ తన బాక్స్ ఆఫీస్ స్టామినను చూపిస్తాడు అని మీడియాలో కథనాలు వెలువాడుతున్నాయి.

Prabhas Sahoo Movie Shooting in Abu Dhabi

సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం ‘అబుదాబి’లో షూటింగు జరుపుకుంటోంది. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో కనిపించే తరహాలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా భారీ ఛేజింగ్ సీన్ ఒకటి రీసెంట్ గా చిత్రీకరించారు. ఈ ఛేజింగ్ సీన్ కోసం 37 ఖరీదైన కార్లను .. 4 భారీ ట్రక్కులను ఉపయోగించారు. ఛేజింగ్ లో కార్లు .. ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొడుతూ ధ్వంసమవుతూ ఉంటాయి.

దీనిని బట్టి ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ లో బైక్ పై ప్రభాస్ చేసే విన్యాసాలు చూసి తీరవలసిందేనని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.