అబుదాబిలో ‘సాహో’ భారీ ఛేజింగ్..

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. బాహుబలి తరువత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.ఈ సినిమా ఎలా ఉంటుందా అని చాలా వరకు టాలీవుడ్‌పై ఓ కన్నేసి ఉంచుతున్నారు సినీ జనాలు. హిందీలో కూడా ఆ సినిమా రూపొందుతుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ మళ్లీ తన బాక్స్ ఆఫీస్ స్టామినను చూపిస్తాడు అని మీడియాలో కథనాలు వెలువాడుతున్నాయి.
Prabhas Sahoo Movie Shooting in Abu Dhabi
సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం ‘అబుదాబి’లో షూటింగు జరుపుకుంటోంది. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో కనిపించే తరహాలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా భారీ ఛేజింగ్ సీన్ ఒకటి రీసెంట్ గా చిత్రీకరించారు. ఈ ఛేజింగ్ సీన్ కోసం 37 ఖరీదైన కార్లను, 4 భారీ ట్రక్కులను ఉపయోగించారు. ఛేజింగ్ లో కార్లు, ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొడుతూ ధ్వంసమవుతూ ఉంటాయి.
దీనిని బట్టి ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారన్నది అర్థం  చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ లో బైక్ పై ప్రభాస్ చేసే విన్యాసాలు చూసి తీరవలసిందేనని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.