విరాట్‌కి గిఫ్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌..

బాహుబ‌లి ఎంత స‌క్సెస్ సాధించిందో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ సినిమాని కొత్త మ‌లుపు తిప్పిన మూవీ అది. ఆ సినిమా ప్ర‌భాస్‌ని నేష‌న‌ల్ స్టార్‌ని చేసింది. ఆ సినిమాలోని మ‌రో ప్ర‌త్యేక‌త ప్ర‌భాస్ ధ‌రించిన ఖ‌డ్గం. అది ఎంతో పాపుల‌ర్ అయింది. సినిమాకి హైలైట్‌గా మారింది. ఆ క‌త్తిని ఇప్పుడు ప్ర‌భాస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంత కీ ఎవరీ విరాట్ అంటే తమిళ లెజండరీ హీరో శివాజీ గణేష్ మనవడు.. హీరో విక్రమ్ ప్రభు కుమారుడు తమిళనాట ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు.

Prabhas Sends Special Gift To Virat

విరాట్ ఈ నెలలో పుట్టిన రోజును జరుపుకోనుండగా, బహుమతిగా, ‘బాహుబలి’ ఖడ్గాన్ని పంపాడు ప్రభాస్‌. ఖడ్గంపైన ‘టు విరాట్ విత్ లవ్.. ప్రభాస్’ అని రాశాడు. ఇక తనకందిన బహుమతిని చూసి విరాట్ అమితానందపడ్డానని చెబుతూ, ఖడ్గాన్ని విక్రమ్ ప్రభు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్ కు కృతజ్ఞతలు చెబుతూ, ఓ మంచి యువకుడికి మంచి కానుక పంపావని అన్నాడు. ప్రభాస్ గొప్పవాడని చెప్పుకొచ్చాడు.