ఒక్క యాక్ష‌న్ పార్ట్‌కే అన్ని కోట్లా..?

ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్ష‌న్ ఎడ్వంచ‌ర్‌ మూవీ `సాహో`. ఈ మూవీని మైత్రి మూవీస్ సంస్థ అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా దాదాపు 220 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత మారిన కాన్వాసులో త‌న‌ని తాను జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌భాస్ ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ప‌ని చేస్తున్నాడ‌ని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ కెన్నీ బేట్స్ సార‌థ్యంలో పోరాట ఘ‌ట్టాల రూప‌క‌ల్ప‌న సాగుతోంది. మునుపెన్న‌డూ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో క‌నిపించ‌ని అసాధార‌ణ పోరాట స‌న్నివేశాల్నిఈ సినిమాలో చూపించనున్నట్లు టాక్‌.

 Prabhas Sky Fight scene with high budget

ప్ర‌భాస్ అండ్ టీమ్‌ యాక్ష‌న్ పార్ట్‌ని అంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఎంచుకున్నారు కాబ‌ట్టి బ‌డ్జెట్‌ని అంతే భారీగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. కేవ‌లం `సాహో` యాక్ష‌న్ పార్ట్ కోసం 30 కోట్ల బ‌డ్జెట్‌ని వెచ్చించారంటేనే ఆర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌భాస్ స‌ర‌స‌న ఈ చిత్రంలో శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ జోడీ కూడా యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో క‌నిపించ‌నున్నారట‌. ఇదిలాఉండగా ఈ మూవీని 2018 ప్ర‌థ‌మార్థంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.