ప్రిన్స్‌కు షాక్‌.. బిగ్‌ హౌస్‌ నుంచి ఔట్..!

Prince eliminated from bigg boss telugu..!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే మొదటిసారిగా ఎన్టీఆర్‌ హోస్ట్ గా వ్యాఖ్యానిస్తున్న సక్సెస్‌ పుల్‌ షో బిగ్‌ బాస్‌. తన మాటల చాతుర్యంతో షోను ఆధ్యంతం ఉత్సాహంతో నడిస్తున్నాడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడంతో ఈ షోపై భారీ అంచనాలు నెలకొంటు షోను ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఈ షో ప్రేక్షకుల అంచనాలకు మించి మంచి రేటింగ్‌ తో తెలుగు బుల్లితెరపై నెంబర్‌ వన్ షోగా కొనసాగుతోంది.

ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో లో ప్రస్తుతం 7 గురు సభ్యులు ఉన్నారు. ‘జై లవ కుశ’ సినిమాతో బిజీ గా ఉన్నప్పటికీ కూడా తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ని వదలకుండా తనదైన శైలిలో రక్తి కట్టిస్తున్నాడు ఎన్టీఆర్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, గెస్ట్ అప్పియరెన్స్ తో, ఎలిమినేషన్ తో కూడా ప్రేక్షకులకి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పటికే ఈ షో హౌజ్‌లోకి రానా, ప్రముఖ యాంకర్‌ సుమ, అల్లరి నరేష్, తాప్సి వంటి ప్రముఖులు గెస్ట్ అప్పియన్స్‌ గా వెళ్లారు.

లాస్ట్‌ వీక్‌లో  అర్చన, మొమైత్ ఎలిమినేషన్ లో ఉండగా అర్చనని సేఫ్ చేసి మొమైత్ ని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. శని, ఆదివారాలు వస్తే చాలు.. ఎలిమినేషన్‌ రౌండ్‌లో బిగ్ బాస్‌ హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి విపరీతంగా ఉంటోంది. బిగ్‌ బాస్‌ షో నుంచి ఎవరూ వెళ్లిపోతారనే ఆసక్తితో జనం షో కోసం ఎదురు చూస్తు ఉంటారు. ఈ వారం కూడా ఎలిమినేషన్‌ దగ్గర పడడంతో  ఇక అప్పుడే నెస్ట్ ఎలిమినేషన్ ఎవరిదీ అనే దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంట రేపుతుంది.

అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో షో నుండి ప్రిన్స్‌ ఎలిమినేట్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌ బాస్‌ షోలో ప్రిన్స్‌ కెప్టెన్‌ గా వ్యవహరించాడు. అంతే కాకుండా తనదైన నటనతో, హాస్యంతో షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ప్రిన్స్‌. అంతే కాకుండా దీక్షా పంత్‌తో రొమాన్స్‌ చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు ప్రిన్స్‌. మొత్తానికి ఈ వారాంతంలో జరగబోయే ఎలిమినేషన్‌లో ప్రిన్స్‌ను బిగ్‌ బాస్‌ హౌజ్‌  నుండి సాగనంపనున్నారు. చూడాలి మరి.. అంతా అనుకుంటున్నట్టుగా షో నుండి ప్రిన్స్‌ ఎలిమినేట్ అవుతాడా..? లేక ఆదర్శ బాలకృష్ణ షోను వదిలి వెళ్లిపోతాడా అన్నది చూడాలి మరి..