డైరెక్టర్ చెప్పిందే చేశా: ప్రియా

Priya Prakash Varrier says she is in no mood to react on complaint ..

ప్రియా ప్రకాశ్ వారియర్.. వీడియో ఇప్పుడు వార్‌ అవుతోంది. రాత్రికి రాత్రే ‘వైరల్’ స్టార్‌గా మారిన ప్రియా చుట్టూ వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. ఓ మళయాల మూవీలో నటిస్తున్న ఆమె.. అందులో ఉన్ని ఓ సాంగ్‌ కోసం ఇచ్చిన హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి.

తాజాగా..ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు. ఆమెతో పాటు నిర్మాతపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

Priya Prakash Varrier says she is in no mood to react on complaint ..

అయితే దీనిపై ప్రియా ప్రకాశ్ వారియర్‌ క్లారిటీ ఇచ్చేసింది. ఓ ఆంగ్ల ఛానల్‌ కు ఇంటర్వూ ఇచ్చిన ప్రియా.. అందులో వల్గర్‌ లేదని చెప్పుకొచ్చింది. ఆ పాటలో మీ హవభావాలు అసభ్యకరంగా ఉన్నాయని కూడా ఫిర్యాదు చేశారని తెలపగా.. ‘‘అస్సలు కాదు, అందులో ఎలాంటి అసభ్యత లేదు. దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారు’’ అని తెలిపింది. అది ముస్లిం సాంప్రదాయ గీతమని మాత్రం తెలుసని, దాన్ని అవమానించామని మేం భావించడం లేదని ప్రియా తెలిపింది.

అంతేకాకుండా ఈ పాటను ఇంతమంది ఆదరిస్తారని నేను అస్సలు భావించలేదని, దేశవ్యాప్తంగా ఇంతమంది ఇష్టపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందిని తెలిపింది. ఆ పాటలో ముస్లింల మనోభావాలను మీరు కించపరిచారనే ఆరోపణలపై మీరేమంటారని ప్రశ్నించగా.. ‘‘ఆ కేసు గురించి నాకు పెద్దగా తెలీదు. డైరెక్టర్ చెప్పిందే చేశాను’’ అని తెలిపింది ఈ వైరల్‌ బ్యూటీ.