టాలీవుడ్‌ చాన్స్‌ కొట్టేసిన ప్రియా..?

ప్రియా ప్రకాష్ వారియర్.. నిన్న మొన్నటి వరకు ఈమె పేరు నెటిజన్లలో తెలిసింది అతి కొద్దిమందికి.. ఈ రోజు ఆమె పేరు తెలియని నెటిజన్లంటూ ఉండరంటే ఒప్పుకునే తీరాలి. అంతగా పాపులరైంది ఆమె. ఆమె తొలిసారి హీరోయిన్ గా నటిస్తున్న మళయాళ మూవీ ఒరు అడార్ లవ్ లో ఓ పాటను ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల చేశారు. అందులో ప్రియా ప్రకాష్ హావభావాలు యువతకు విపరీతంగా నచ్చేయడతో ఆ పాట ట్రెండింగ్ గా మారిపోయింది.

Priya Prakash Warrior Entry Tollywood?

భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తాన్ని ఊపేసిన ఈ పాటలో నటించడానికి ముందు తాను ఎలాంటి రిహార్సల్ చేయలేదని అంటోంది ప్రియా. ‘‘హీరోను చూసి చిరునవ్వు నవ్వుతూ కన్ను గీటే సీన్ ను డైరెక్ట్ గానే చేశాను. అంటూ తనకింత క్రేజ్ తెచ్చిన సీన్ గురించి చెప్పుకొచ్చింది ప్రియ ప్రకాష్ వారియర్. ఇప్పుడు ఎక్కడ చూసినా కుర్రాళ్లంతా ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోలో ఆమె చూపిన హావభావాలకు కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు. దాంతో ఒక్కసారిగా అటు మలయాళంతో పాటు ఇటు ఇతర భాషల్లో కూడా ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

టాలీవుడ్ .. బాలీవుడ్ నుంచి కూడా ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయట. నిఖిల్ .. తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేయాలనుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రియా ప్రకాశ్ ను సంప్రదించగా, ఆమె డేట్స్ చూస్తోన్న దర్శకుడు ఒమర్ లులు .. రెండు కోట్లు డిమాండ్ చేశాడట. ఇక ఈ అమ్మాయిని తమ సినిమాల కోసం మాట్లాడమని మరి కొంతమంది కుర్ర హీరోలు కూడా దర్శక నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.