ఆసియా శృంగార తార..ప్రియాంక

Priyanka Chopra Sexiest Asian Woman

తన అందచందాల  ఆరబోతతో బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ పాగావేసిన బ్యూటీ ప్రియాంక చోప్రా.  ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్‌ షోతో కుర్రకారు మతిపొగొట్టే ప్రియాంక అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ని సెట్‌ చేయడంలో తనకు తానే సాటి. క్వాంటికో సిరీస్‌తో తెగ పాపులరైన ఈ బ్యూటీకి హాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో ఉబ్బితబ్బైపోతోంది.

Priyanka Chopra Sexiest Asian Woman
ప్రస్తుతం ప్రియాంక జపంతో బాలీవుడ్,హాలీవుడ్ మార్మోగిపోతుంది. భారత్‌ తరపున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న క్వాంటికో బ్యూటీ తాజాగా ఆసియాలో అత్యంత శృంగార మహిళగా నిలిచింది. లండన్‌ కేంద్రంగా వెలువడే ఈస్టన్ ఐ ఆన్‌ లైన్ ఓటింగ్ ద్వారా ప్రపంచంలోనే 50 మంది అత్యంత శృంగార మహిళలను ఎంపిక చేసింది.

ఆన్‌లైన్‌ పోల్‌-2017లో అత్యధిక ఓట్లు ప్రియాంకను వరించాయి. గతేడాది  దీపికా పదుకొనె…టాప్‌ ప్లేస్‌లో నిలవగా ఈసారి మూడో స్థానానికే పరిమితమయ్యారు.  బుల్లితెర నటి నియా శర్మ రెండో స్థానంలో నిలవగా  ఆలియా భట్‌ (4వ స్థానం), పాకిస్తానీ నటి మాహిర్‌ ఖాన్‌(5), ద్రష్టిధామీ(6), కత్రినా కైఫ్‌(7), శ్రద్ధా కపూర్‌(8), గౌహర్‌ఖాన్‌(9), రుబీనా దిలోక్‌(10)లు తొలి పదిస్థానాల్లో నిలిచారు.