త‌ల్లి పాత్ర‌లో కనిపించనున్న ప్రియాంక..!

Priyanka Chopra Will Play Mother Role

బాలీవుడ్‌లో అడుగు పెట్టి తన నటనతో అదరగొట్టిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇక బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా తన నటనతో అదరహో అనిపిస్తుంది. క్వాంటికో అనే అమెరిక‌న్ టీవీ సిరీస్‌తో అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొంది హాలీవుడ్‌లో సైతం దూసుకుపోతోంది. తొలిసారి బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో త‌న హ‌వా చూపిస్తున్న ప్రియాంక చోప్రా త్వ‌ర‌లో బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేయ‌నుంది.

Priyanka Chopra Will Play Mother Role

స‌ల్మాన్ స‌ర‌స‌న భ‌ర‌త్ అనే చిత్రం చేయ‌నున్న ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నుంది. ఇది ‘ఇమ్యునోడెఫిషియన్సీ’ వ్యాధితో (రోగ నిరోదక శక్తి లోపించడం) మృతి చెందిన 18 ఏళ్ల మ‌హిళ అయేషా చౌద‌రి జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నుంది.

ఈ చిత్రంలో అయేషా పాత్ర‌లో దంగ‌ల్ ఫేం జైరా వ‌సీమ్ న‌టించ‌నుండగా, ఆమె త‌ల్లి పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తార‌ట‌. ఇక ప్రియాంక భ‌ర్తగా అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టిస్తాడ‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది చివ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు. గ్లోబ‌ల్ భామ ప్రియాంక ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో క్వాంటికో సిరీస్‌తో పాటు ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాల‌తో బిజీగా ఉంది.