ఆ హీరోల కోసం సిద్దంగా ఉన్న పూరి..

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ హిట్లలో ఉన్నా..ఫ్లాప్‌ల్లో ఉన్నా..ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ మారలేదు. హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ కొట్టగల దమ్మునోడు. స్టార్ హీరో అయినా..యంగ్ హీరోలతో అయినా మూడు నెలల్లో సినిమా పూర్తీ చేయడం ఈ డాషింగ్ డైరెక్టర్ మరో స్పషాలిటీ. హీరో కనిపించే ప్రతి సీన్లలో పూరి మార్క్‌ ఖచ్చితంగా కనిపిస్తుంది.

Puri Jaganath next films with top heroes

అయితే పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని తన తనయుడు పూరి ఆకాశ్‌తో చేయనున్నట్టు తెలిసిందే. ఆ తరువాత సినిమా బాలకృష్ణతోనే ఉంటుందని అన్నాడు. ఈ విషయాన్ని బాలకృష్ణ కూడా స్పష్టం చేశాడు. ఇక వీళ్లు కాకుండా పూరీ జాబితాలో చాలామందే స్టార్ హీరోలు కనిపిస్తున్నారు. మహేశ్ తో ‘జన గణ మన’ చేయనున్నట్టు పూరీ ప్రకటించాడు కానీ .. మహేశ్ మాత్రం స్పందించనే లేదు. ఈ సినిమా మహేశ్ చేయడం డౌటే అనే టాక్ కూడా వినిపిస్తోంది.

Puri Jaganath next films with top heroes

ఇక రవితేజ కోసం .. వెంకటేశ్ కోసం కథలు సిద్ధంగా వున్నట్టుగా పూరీ చెప్పాడు. పూరీతో వున్న ఫ్రెండ్షిప్ కారణంగా రవితేజ ఓకే చెప్పే ఛాన్స్ వుంది .. ఎటొచ్చీ ఓ పట్టాన వెంకటేశ్ ను ఒప్పించడమే కష్టం. ఈ నేపథ్యంలోనే చిరూకి కథ చెప్పాననీ .. ఆయనకి నచ్చేసిందని పూరీ అన్నాడు. ఆయనతో తప్పకుండా ఓ సినిమా చేస్తానని చెప్పాడు. అయితే చిరూకి గల కమిట్మెంట్స్ కారణంగా ఇప్పట్లో అది కుదరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో రవితేజతో మినహా మిగతా వాళ్లతో పూరీ సెట్స్ పైకి వెళ్లడం ఇప్పట్లో జరగకపోవచ్చని చెప్పుకుంటున్నారు.