సైలెంట్ గా స్టార్ట్ చేసిన పూరి..!

Puri Jagannadh starts Mehbooba

హిట్టొచ్చినా, ప్లాపొచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఎప్పుడు బిజీనే.  ఇటీవల బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పైసా వసూల్ సినిమాతో పరవాలేదనిపించిన పూరి ఈసారి తన తనయుడు ఆకాస్‌ని  రీలాంచ్‌ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఫస్ట్ పోస్టర్‌ని విడుదల చేసిన పూరి ఇవాళ సినిమా షూటింగ్‌ని ప్రారంభించాడు.

Puri Jagannadh starts Mehbooba
హిమాచల్ ప్రదేశ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ముహూర్తానికి సంబంధించి చిత్రయూనిట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ గారే ఈ ముహూర్తాన్ని సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్ తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Puri Jagannadh starts Mehbooba
1971 నాటి ఇండియా పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుందని చెప్పుకొచ్చిన పూరి…. గతంలో తాను తీసిన చిత్రాలకన్నా ఇది భిన్నంగా ఉంటుందని, తన ఆలోచనల పరిధిని దాటి ఉంటుందని తెలిపాడు. మంగళూరుకు చెందిన నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా  సందీప్ చౌతా మ్యూజిక్ అందించనున్నట్టు తెలిపాడు.
Puri Jagannadh starts Mehbooba
Puri Jagannadh starts Mehbooba