పూరీ రిలీజ్‌ చేసిన ‘‘క్యా కరూన్‘‘…

Puri Jagannath launched First song from 47 Days

ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘’47 డేస్’’.. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నుండి ‘‘క్యా కరూన్‘‘ అని సాగే మొదటి పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు.

రఘు కుంచె స్వరపరచిన ఈ గీతానికి సాహిత్యం లక్ష్మీ భూపాల్ అందించారు.ఈ మెలోడియస్ లవ్ సాంగ్ ను సింగర్ నీహా కడివేటి పాడారు.

Puri Jagannath launched First song from 47 Days

సత్య దేవ్, పూజా ఝావేరి, రోషిని ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచే, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మాతలు..గ్రిప్పింగ్ నేరేషన్ తో సాగే ఈ కథ ప్రేక్షకుల్ని ఆద్యాంతం థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.

షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. గోవా, వైజాగ్, అరకు, లక్నవరంఅండ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో బిగ్ బాస్ హరితేజ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్,
కిరీటి, అశోక్ కుమార్, తదితరులు నటిస్తున్నారు.

Puri Jagannath launched First song from 47 Days

..