కొరియా ఓపెన్ చాంపియ‌న్

PV Sindhu vs Nozomi Okuhara
PV Sindhu vs Nozomi Okuhara

ఇవాళ జ‌రిగిన కొరియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్లో ఒకుహ‌ర‌పై ప్ర‌తీకారం తీర్చుకుంది పీవీ సింధు. ఒకుహ‌ర‌పై 22-20, 11-21, 21-18 తేడాతో గెలిచి ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఎదురైన ఓట‌మికి బ‌దులు తీర్చుకుంది. ఆ ఫైన‌ల్ అంత హోరాహోరీగా సాగ‌క‌పోయినా ఈ మ్యాచ్ కూడా బ్యాడ్మింట‌న్ ఫ్యాన్స్‌ను బాగానే ఆక‌ట్టుకుంది. టైటిల్ కోసం ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ తీవ్రంగా పోటీప‌డ్డారు. తొలి గేమ్ నుంచే నువ్వా నేనా అన్న‌ట్లు సాగిందీ మ్యాచ్‌. కెరీర్‌లో సింధుకు ఇది మూడో సూప‌ర్ సిరీస్ టైటిల్‌. ఇప్ప‌టికే ఆమె ఇండియా ఓపెన్, చైనా ఓపెన్ టైటిల్స్ గెలిచిన విష‌యం తెలిసిందే. కొరియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ టైటిల్ గెలిచిన తొలి ఇండియ‌న్ షట్ల‌ర్‌గానూ సింధు చరిత్ర సృష్టించింది..