రాశీఖన్నా టార్గెట్ ఇదే…!

rassi-khanna-turns-philosopher

అందమైన నవ్వుతో తెలుగుతెరపై సందడి చేస్తోంది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ సుందరి రాశి, వాసిలోనూ ప్రతిభను చాటుతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

rassi-khanna-turns-philosopher

రాశీఖన్నా.. అంత ఈజీగా ఎవరితోనూ కలవదంట. ఆ విషయాన్ని తానే చెబుతోంది. అంతే కాదు.. తాను ఒక పుస్తకాల పురుగంట. ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుందంట. చాలా సమయాన్నిపుస్తకాలు చదివేందుకే.. గడిపేస్తుంటానని.. ఈ విషయంలో తన అమ్మతో కూడా.. మాటలు అనిపించుకుంటూ ఉంటానని రాశీ ఖన్నా చెప్పింది. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావని అప్పుడప్పుడూ అమ్మ కూడా కోప్పుడుతుందని చెప్పింది. అయినా కూడా.. తన మాటలు చాలా మందిని ప్రభావితం చేశాయంటున్న రాశీ.. అది తన గొప్పతనం కాదంటోంది.

rassi-khanna-turns-philosopher

రాశీఖన్నా ఇప్పటికే సాయిధరమ్, రామ్ వంటి యువహీరోల సినిమాలు దాటేసి రవితేజ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలపై ఫోకస్ పెట్టింది. మొత్తానికి తెలుగులో కాస్త కుదురుకోగానే ఇప్పుడు తన టార్గెట్ కోలీవుడ్‌కు మార్చింది. అక్కడి ఇప్పటికే ‘సైతాన్ కా బచ్చా’, ‘ఇమైకా నోడిగళ్’ అనే రెండు సినిమాల్లో నటించింది ఈ అందాల రాశి… సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి.