లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి రాహుల్..!

Rahul accidentally enters ladies toilet..!

గుజరాత్  ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఉడేపూ్ర్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ ‘సంవాద్‌’ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు తర్వాత ఆయన టౌన్‌హాల్‌ నుంచి బయటకు వస్తూ.. అక్కడ ఉన్న లేడిస్‌ టాయ్‌లెట్‌లోకి ప్రవేశించారు. అక్కడ లేడీస్ టాయ్‌లెటా? లేక పురుషులదా? అన్న సంకేత బొమ్మలు లేవు. కేవలం గుజరాతీలో ‘మహిళల మరుగుదొడ్డి’ అని రాసి ఉంది.

Rahul accidentally enters ladies toilet..!
దీంతో  పొరపాటున రాహుల్‌ లేడీస్‌ వాష్‌రూంలోకి వెళ్లిపోయారు. లేడిస్ టాయ్ లెట్‌ అని గుజరాత్‌లో రాసి ఉండటంతో రాహుల్ కన్‌ఫ్యూజయ్యారు. దాంతో రాహుల్‌ని చూసి అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారట.  లేడీస్‌ టాయ్‌లెట్‌ అని గుజరాతీలో రాసుండటంతో.. భాష రాక రాహుల్‌ అర్థంచేసుకోలేకపోయారని ఆ పార్టీ నేతలు తెలిపారు.  ఈ విషయం గురించి మీడియా రాహుల్‌ని ప్రశ్నించినా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారట.

రాహుల్‌ లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్లిన వెంటనే ఈ ఘటనను కవర్‌ చేసేందుకు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులను ఆయన ఎస్పీజీ సిబ్బంది చెల్లాచెదురు చేసింది. అయినా, కొందరు మీడియా ప్రతినిధులు ఈ ఘటనను తమ కెమెరాలో బంధించారు.  ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.