రాహుల్‌ ఎఫెక్ట్‌..రాజీనామాలు షురూ..

Raj Babbar resigns as Congress' UP chief...

యువతకు అవకాశాం కల్పించాలన్న రాహుల్ పిలుపు కొంతమంది కాంగ్రెస్‌ నాయకుల రాజీనామాలకు కారణమౌతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..పార్టీలోని వయోధికులు పదవుల నుంచి తప్పుకొని యువతకు అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.

దీంతో పార్టీలోని సీనియర్‌ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి రాహుల్‌ స్పీచ్‌ ఎఫెక్ట్‌ కన్పిస్తోందనే చెప్పాలి. ఇప్పటికే గోవా పీసీసీ అధ్యక్షుడు శాంతారామ్‌నాయక్‌ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Raj Babbar resigns as Congress' UP chief...

ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన రాజ్‌బబ్బర్‌ తన రాజీనామా గురించి మాత్రం ప్రస్తావించకుండానే… ‘నన్ను ఇక్కడికి ప్రత్యేకమైన పని కోసం పంపించారు. దాని కోసం నా శాయశక్తులా పనిచేశాను. నా పనితీరు ఒక్కోసారి బాగుండొచ్చు.. ఒక్కోసారి బాగుండకపోవచ్చు. దీనిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది, నేను ఎలాంటి కామెంట్లు చేయను’ అని అన్నారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి బాధ్యతలు, పాత్రల్లో మార్పు ఉంటుందని భావిస్తున్నా. ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తారనే అంశం పార్టీ అధిష్ఠానంపై ఆధారపడి ఉంది’ అని రాజ్‌బబ్బర్‌ దిల్లీలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరైన అనంతరం పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాజ్‌ బబ్బర్‌ రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఆమోదించాల్సి ఉంది.