మరో ‘పెళ్లి చూపులు’గా ‘మెంటల్ మదిలో’..

Raj Kandukuri's Next Film 'Mental Madilo' Release Date

‘పెళ్లి చూపులు’ బడ్జెట్ పరంగా తారాగణం పరంగా చాలా చిన్న సినిమా .. అయినా అది ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాను నిర్మించిన రాజ్ కందుకూరి .. సురేశ్ బాబుకి చూపించగా, ఆయనకి నచ్చి డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

Raj Kandukuri's Next Film 'Mental Madilo' Release Date

ఇక తాజాగా రాజ్ కందుకూరి .. ‘మెంటల్ మదిలో’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణు .. నివేతా పేతురాజ్ నాయకా నాయికలుగా నటించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సారి కూడా రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్టు కాపీని సురేశ్ బాబుకి చూపించారట. ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంటానని సురేశ్ బాబు చెప్పారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.