రాజా ది గ్రేట్…ప్రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

Raja The Great Pre-Release Event details

మాస్‌ మహరాజా రవితేజ చాలాకాలం తర్వత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్దమౌతున్నాడు. ఈ మూవీ ఈ నెల 19వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో  చూపులేని వ్యక్తిగా రవితేజ కనిపించే ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ కనిపించనుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా  ప్రమోషన్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. సినిమా పోస్టర్‌ దగ్గరి నుంచి టీజర్,ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జరపడానికి దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు.

ఈ నెల 14వ తేదీన ఈ ఫంక్షన్ ను గ్రాండ్ గా జరపనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పటాస్ .. సుప్రీమ్ వంటి హిట్స్ తరువాత అనిల్ రావిపూడి చేసిన సినిమా ఇది. ఇక ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ .. ‘మహానుభావుడు’ సక్సెస్ ల తరువాత మెహ్రీన్ చేసిన మూవీ ఇది. ఈ ఇద్దరికీ ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ఇస్తుందో వేచిచూడాలి.

Raja The Great Pre-Release Event details