You are here
రవితేజ…ఇండిపెండెన్స్ డే ట్రీట్ టాప్ స్టోరీస్ తాజా వార్తలు సినిమా 

రవితేజ…ఇండిపెండెన్స్ డే ట్రీట్

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `రాజా ది గ్రేట్` . బెంగాల్ టైగర్ విడుదలై రెండు సంవత్సరాలు కావస్తుండటంతో రవితేజ నుంచి ఫస్ట్ లుక్.. టీజర్.. లాంటి విశేషాలు విని రెండేళ్లవుతోంది.

Raja The Great Movie First Look Teaser
ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేయడంతో ముందుగా టీజర్ తో పలకరించబోతున్నారు.  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు శనివారం ప్రకటించారు. మాస్‌ మహారాజా రవితేజను మునుపెన్నడూ లేనివిధంగా చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.

ఇందులో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఎస్‌. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మరోపక్క రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నారు. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. విక్రమ్‌ సిరికొండ దర్శకుడు.

Raja The Great teaser as Independence Day

Related Articles