జక్కన్న నెక్ట్స్‌ సినిమా ఇదే…

Rajamouli next with Danaiah

బాహుబలితో భారతీయ సినిమా రేంజ్‌ ముఖ్యంగా తెలుగు సినిమా సత్తాను చాటాడు దర్శకధీరుడు రాజమౌళి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రస్తుతం బాహుబలి సక్సెస్‌ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు జక్కన్న. బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటీ అనేదానిపై మాత్రం ఇప్పటివరకు నోరు విప్పని  రాజమౌళి తాజాగా స్పందించాడు.

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి….తన తర్వాతి సినిమాను డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సోషల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పిన ఆయన…చిత్రంలో నటించే వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ఎన్నిభాషల్లో తెరకెక్కిస్తామో చెప్పలేనని …దానయ్యతో సినిమా ఒప్పుకున్న అదే నా తర్వాతి చిత్రం అని చెప్పారు.

Rajamouli next with Danaiah
ఇప్పటికే రాజమౌళితో సినిమా కోసం  ఎన్టీఆర్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. పలు ఆడియో ఫంక్షన్లలో తనమనసులోని మాటను బయటపెట్టాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే హీరో ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే రాజమౌళి-మహేష్‌ ఇద్దరు తమ కాంబినేషన్లో సినిమా రాబోతుందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్‌ జక్కన్నతో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం.