రాజమౌళి నెక్స్ట్ మూవీలో రామ్‌ చరణ్‌..?

Rajamouli's next movie with Ram Charan?

రాజమౌళి తెలుగు చలన చరిత్రలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ లో నెంబర్ 1 డైరెక్టర్. ఇప్పటి వరకూ ఫ్లాప్స్ లేని దర్శకధీరుడు. ఒక్క పరాజయం కూడా చవిచూడకుండ వరుసగా 10 సినిమాలు తెలుగు పరిశ్రమకు అందిచాడు. హీరోలతోనే కాదు ఈగ తో కూడా సినిమా తీసి హిట్ ఇవ్వగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి, కలెక్షన్స్ తో రికార్డ్స్ బద్దలు కొట్టింది.

Rajamouli's next movie with Ram Charan?

అయితే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మగధీర’ వరుస రికార్డులను సృష్టించిందనే సంగతి తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అందుకు సమయం ఆసన్నమైందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.

Rajamouli's next movie with Ram Charan?

ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి రాజమౌళి మరింత చేరువయ్యారు. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ‘సైరా నరసింహ రెడ్డి’ టైటిల్ లోగో రిలీజ్ రాజమౌళి చేతుల మీదుగా జరిగింది. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ‘శ్రీ వల్లి’ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చరణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ చరణ్ తోనే అంటు ప్రచారం జోరందుకుంది. ‘రంగస్థలం 1985’ తరువాత చరణ్ సెట్స్ పైకి వెళ్లేది రాజమౌళితోనేనని చెప్పుకుంటున్నారు.