You are here

షారుఖ్‌ మూవీలో తలైవా ఎంట్రీ..

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ ఎంతగానో ఆరాధిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. తలైవా(రజనీ)పై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగి డ్యాన్స్ గీతాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేసి ఆయన మీద ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం షారుఖ్‌ఖాన్ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించబోతున్నాడని తెలిసింది.

 rajini kantha plays guest roll in sharikh next movie

షారుఖ్‌ఖాన్ హీరోగా, సరసన దీపికాపదుకునే హీరోయిన్లుగా కబీర్‌ఖాన్ దర్శకత్వంలో శిద్యాత్ పేరుతో ఓ మూవీ తెరకెక్కనుంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో రజనీకాంత్ నటించనున్నారని ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

షారుఖ్‌ఖాన్ అభ్యర్థన మేరకు ఈ చిత్ర కథాంశాన్ని విన్న రజనీకాంత్ ఇందులో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్ కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Related Articles