రకుల్ కి వింత అనుభవం

rakul new experience

 హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి ఓ వింత అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికపై శుక్రవారం రాత్రి జరిగిన స్పైడర్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో మొదట వేదికపై నుంచి అభిమానులని ఉద్దేశించి మాట్లాడిన డైరెక్టర్ మురుగదాస్.. సినిమాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అందులో కొంతమంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పేర్లని కూడా ప్రముఖంగా ప్రస్తావించాడు.

కానీ అంతిమంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరుని ప్రస్తావించడం మాత్రం మర్చిపోయాడు. మాట్లాడిన చోటు నుంచి కాస్త పక్కకు జరిగాకా రకుల్ ప్రీత్ సింగ్ గుర్తుకురావడంతో మళ్లీ వెనక్కి వచ్చి రకుల్‌కి సారీ అంటూ ఆమె సహకరించిన తీరుని చెప్పుకొచ్చాడు.

 rakul new experience

ఇదిలావుండగానే, మురుగదాస్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే, మళ్లీ ఈసారి సూపర్ స్టార్ నుంచి మళ్లీ అటువంటి షాకే ఎదురైంది. మహేష్ బాబు కూడా అందరు సాంకేతిక నిపుణులకి థాంక్స్ చెప్పి రకుల్ పేరుని తీసుకురావడం మర్చిపోయాడు. ఆ తర్వాత అచ్చం మురుగదాస్‌లాగే రెండు అడుగులు ముందుకేసి, వెనక్కి వచ్చిన మహేష్.. మళ్లీ మురుగదాస్ లాగే నాకూ జరిగింది అంటూ రకుల్‌కి సారీ చెప్పాడు. స్పైడర్ షూటింగ్ కోసం ఎప్పుడు, ఎలా డేట్స్ అడిగినా కాదనకుండా సహకరించిందని ఆమెకి థాంక్స్ చెప్పాడు మహేష్ బాబు.