బిజీ బిజీగా రకుల్ ప్రీత్

Rakul-Preet-Singh

రకుల్ ప్రీత్ సింగ్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీల్లో క్రేజీ స్టార్. ఈమె ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబు సరసన స్పైడర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే సెప్టెంబరు నెలలో విడుదల కానుంది. తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా రకుల్ ప్రీత్‌సింగ్ టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో నటించిన జయ జానకీ నాయక, రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాల్లో నటించి మంచి పేరునే తెచ్చుకుంది.

Rakul-Preet-Singh

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఇటు తెలుగులో, అటు తమిళంతో పాటు హిందీలో కూడా ఈ భామ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవలే తెలుగులో మహేష్‌ బాబు సరసన స్పైడర్‌ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా షూటింగ్‌ కోసం రోమెనియా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. అటు తమిళంలో కూడా ఈ ముద్దుగుమ్మ కార్తీ సరసన తీరన్ అధిగారం ఒండ్రు సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Rakul-Preet-Singh

అటు బాలీవుడ్‌ లో సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న అయ్యారీ సినిమాలో కూడా రకుల్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం  ఢిల్లీలో జరుగుతోంది. క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ పిక్చర్లను ఇంట్రస్టింగ్ గా తీసే నీరజ్ పాండే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్‌ తో ఉన్న రకుల్‌ కు ఈ సినిమాలు ఏమేరకు పేరును తీసుకొస్తాయో చూడాలి.