ప్రేమ పెళ్లే చేసుకుంటా…

rakul preeth singh

సినీ తారలు వారి క్రేజ్ ను బట్టి చాలా వయ్యారంగా మాట్లాడుతుంటారు. కొన్ని సార్లు పలు విచిత్రాలు చేస్తుంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా భలే మాట్లాడేసింది. తాజాగా రకుల్ నటించిన జ‌య జాన‌కి నాయ‌క చిత్రం ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుండ‌గా, చిత్ర ప్రమోష‌న్స్ లో ఫుల్ యాక్టివ్ అయింది. ఈ సంద‌ర్భంగా పలు విష‌యాల‌ను పంచుకుంది రకుల్. ఈ సంద‌ర్భంగా పలు విష‌యాల‌పై ప్ర‌స్తావించింది.

తొలుత‌ తెలుగు రాకపోవడంవల్ల సినిమా షూటింగ్ సమయంలో ఏడ్చేశానని చెప్పింది. పట్టుదలతో తెలుగు నేర్చుకుని, నటనకి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని అంది. ఇక ప్రేమ విషయానికి వస్తే .. తనకి ప్రపోజ్ చేసే సాహసం ఎవరూ చేయలేదనీ, ఒకరిద్దరు ట్రై చేసినా, తాను పట్టించుకోలేదని చెప్పింది. ఇక‌ పెళ్లి విషయానికి వస్తే .. పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా .. ప్రేమించే పెళ్లి చేసుకుంటానని అంది.

ఇక ప్రేమ విషయానికి వస్తే .. తనకి ప్రపోజ్ చేసే సాహసం ఎవరూ ఇంతవరకు చేయలేదనీ, ఒకరిద్దరు ట్రై చేసినా, తాను పట్టించుకోలేదని చెప్పింది. ఇక‌ పెళ్లి విషయాన్ని గురించి చెప్పాలంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కాక.. ప్రేమించే పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని తాను భావిస్తున్నట్లు వివరించింది రకుల్. ఇంకా తనకు మంచి పొడగరి.. భోజన ప్రియుడు అయి.. ముఖ్యంగా సినిమాలంటే ఇష్టం వుండే వ్యక్తి అయితే భర్తగా స్వీకరిస్తానని వివరించింది ర‌కుల్ ప్రీత్ సింగ్.