రకుల్ కు షాకిచ్చిన మహేష్ బాబు..

rakulpreet-

ప్రిన్స్‌ మహేష్‌ బాబు అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌ను మరిచిపోయాడు.. అదేంటి ఈ మద్యనే వారిద్దరు కలిసి స్పైడర్‌ సినిమాలో నటించారు. అలాంటిది మహేష్‌ బాబు రకుల్ ను మరిచిపోవడం ఏంటని అనుకుంటున్నారా… అవును నేను చెప్పేది నిజమే.. మహేష్‌ బాబు రకుల్ ను నిజంగానే మరిచిపోయాడు.. ఇది నిజజీవితంలో కాదు.. క్రేజీ డైరెక్టర్‌ మురుగదాస్, ప్రిన్స్‌ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందిన మూవీ’స్పైడర్’ . ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్, ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడూ వస్తుందా అని మహేష్‌ బాబు అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు.

Rakul-Preet-Singh-

ఇటీవలే హైదరాబాద్ లోని శిల్పకలా వేదికలో స్పైడర్‌ మూవీ ప్రీరిలీజ్‌ వేడుకను గ్రాండ్‌ గా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ఈ ఫంక్షన్‌కు రకుల్ వేసుకొచ్చిన డ్రెస్‌ అట్రాక్షన్‌ గా నిలిచింది. అయితే ఈ భామను వేడుక మీట్ లో హీరో మహేష్‌ బాబు, డైరెక్టర్ మురుగదాస్ మరిచిపోయారు. మహేష్ కంటే ముందు మురుగదాస్ మాట్లాడాడు. తన అసిస్టెంట్ డైరక్టర్లు, టెక్నీషియల్, మహేష్, ఎస్ జే సూర్య ఇలా అందరి గురించి మాట్లాడాడు. కానీ హీరోయిన్ గురించి మాట్లాడ్డం మరిచిపోయాడు. మళ్లీ వెనక్కి వచ్చి రకుల్ కు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు.

rakul_

తర్వాత మాట్లాడిన హీరో మహేష్‌ బాబు కూడా స్టేజ్ పై రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి చెప్పడం మరిచిపోయాడు. వెళ్లిపోతూ మళ్లీ వెనక్కొచ్చి మైక్ తీసుకొని రకుల్ గురించి మాట్లాడాడు. అడిగినప్పుడల్లా కాల్షీట్లు ఇచ్చి కోపరేట్ చేసిన రకుల్ కు థ్యాంక్స్ చెప్పాడు మహేష్. మొత్తానికి అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌ను స్పైడర్‌ ప్రీరిలీజ్ వేడుక వేదికగా హీరో మహేష్‌ బాబు, దర్శకుడు మురుగదాస్ మరిచిపోవడం ఇప్పుడు ఫిల్మ్‌ నగర్‌ లో చర్చనీయాంశమవుతోంది.