రంగస్ధలం…సర్‌ ప్రైజ్‌

Ram Charan’s Rangasthalam released on December 9

ప్రముఖ దర్శకుడు సుకుమార్, నటుడు రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా కొనసాగుతోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌ చల్‌గా మారాయి. ఆనాటి కాలాన్ని తలపించేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సినిమా ఫస్ట్ లుక్‌ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఫ్యాన్స్‌ సైతం ఫస్ట్ లుక్‌ కోసం ఆతృతతో  ఎదురుచూస్తున్నారు.

‘మీరంతా ‘రంగస్థలం’ ఫస్ట్‌లుక్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని తెలుసు. నేనూ మిస్టర్‌.సి(చరణ్‌) కూడా అంతే ఎదురుచూస్తున్నాం. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫస్ట్‌లుక్‌ సర్‌ప్రైజ్‌ రాబోతోంది’ అని ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు. శనివారం సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ రాబోతుందని ఉపాసన తెలిపింది.

Ram Charan’s Rangasthalam released on December 9
పీరియడిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్‌, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిమాకు సంబంధించి ఇప్పటికే 35 కోట‍్లకు పైగా బిజినెస్‌ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది.

ముందుగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేయగా వాయిదాపడింది. పవన్‌ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుండటంతో అబ్బాయ్ వెనక్కి తగ్గాడు.  మార్చి 16న ప్రేక్షకుల ముందుకు సందడిచేసేందుకు రానున్నాడు మిస్టర్ సి.