ఆ జోకర్‌ని…. నేనే…!

Ram Gopal Varma Calls Himself A ‘Joker’

రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. ఈ మధ్య ఎక్కువగా తానే తీసిన సినిమాలతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో కాంట్రవర్సికి కేరాఫ్  అడ్రస్‌గా నిలుస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి తాజా పాలిటిక్స్ వరకు తనదైన శైలీలో విమర్శలను ఎక్కుపెట్టే వర్మ  ఎప్పుడు ఎవరిమీద మాటల యుద్దం చేస్తాడో తెలీదు. తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడడం, ఆ తర్వాత సారీ లు చెప్పడం వర్మకు మాత్రమే సొంతం.

అయితే,ఈ సారి కాస్త భిన్నంగా తనపై తానే సెటైర్ వేసుకున్నాడు ఈ కాంట్రవర్సి దర్శకుడు. ఓ సారి తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన వర్మ తాజాగా చిన్నప్పుడు తన తల్లి సూర్యమ్మతో కలిసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఆ అందమైన మహిళ మా అమ్మ. పక్కన జోకర్‌లా కనిపిస్తున్నది నేనే’అని వర్మ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వర్మ  అరెస్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రోగ్ భామ మున్నారా చోప్రాకు వర్మ పిలిచిమరి అవకాశాన్ని ఇచ్చాడట. అమితాబ్ బచ్చన్‌తో ‘సర్కార్ 3’ తెరకెక్కించిన వర్మ  అభిషేక్ బచ్చన్‌తో తెరకెక్కిస్తున్న ‘అరెస్ట్’ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.