‘రంగస్థలం’పై రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌..

Ram Gopal Varma Tweets On Rangasthalam Movie

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. మార్చ్ 30న విడుదలకు షెడ్యూల్ చేసిన ఈ మూవీకి.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. హీరో చరణ్.. హీరోయిన్ సమంత క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్లు ఇచ్చేశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి తొలి లిరికల్ సాంగ్ కూడా వచ్చేసింది. ‘ఎంత సక్కగున్నావే’ అంటూ సాగే పాటను విడుదల చేసింది రంగస్థలం యూనిట్.

చంద్రబోస్ రాసిన లిరిక్ ఎంత బాగుందో.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ అంతకంటే అద్భుతంగా ఉంది. చాలు సులువైన అచ్చ తెలుగు పదాలను ఏరి ఎంపికచేసి మరీ కూర్చిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. అంత మంచి పాటకు డీఎస్పీ క్యాచీ ట్యూన్ ఇవ్వడమే కాకుండా.. తనే పాడి మరీ అలరించాడు. రాక్ స్టార్ మ్యూజిక్ ఇస్తే హిట్ అవడం సహజమే కానీ.. చాలారోజుల తరువాత దేవిశ్రీప్రసాద్ చాలా మంచి పాటతో వచ్చాడనే సంగతి అర్ధమవుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్ విడుదల కాగా… అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని ఆయన తెలిపారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన సాంగ్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లిందని చెప్పారు. పాట రాసిన బోస్ కు మిలియన్ ఛీర్స్ అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ ను కూడా అభినందించారు.