కింగ్ నాగార్జున ఆఫీసర్ టీజర్ ఎప్పుడంటే..

పదేళ్ల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‎గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్‎లో రూపొందుతున్న చిత్రం ఆఫీసర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే నాగర్జున ఆఫీసర్ ఫస్ట్ లుక్‎తో అభిమానుల్లో హైప్ క్రియేట్ చేశాడు. తాజాగా రామ్‎గోపాల్ వర్మ తన బర్త్‎డే సందర్భంగా ఏప్రిల్ 9న ఉ. 10 గంటలకు ఆఫీసర్ టీజర్‎ను విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా పోస్టర్ పోస్ట్ చేశాడు.

Ramgopal Varma Posted officer Movie teaser releace date

ఈ చిత్రం షూటింగ్ మొత్తం ముంబైలో జరిగినట్టు తెలుస్తుంది. 28 ఏళ్ల తర్వాత క్రితం శివ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్-వర్మ కాంబినేషన్ మళ్లీ ఆఫీసర్ చిత్రంతో మరో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‎లో వచ్చిన గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ తన సొంత బ్యానర్ కంపెనీ ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మైరా సరీన్ అనే కొత్త అమ్మాయిని కథానాయికగా నటిస్తుంది. మే 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

నేడు ఆయన బర్త్ డే సందర్బంగా పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. శ‌త్రువులు త‌న‌కి అన్ హ్య‌పీ బ‌ర్త్‌ డే అని విష్ చేయ‌నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. జ‌న‌ర‌ల్‌గా నాకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన వారంద‌రిని హేట్ చేస్తుంటాను. కాని నీ బ‌ర్త్‌డే విషెస్ నాకు కావాల‌ని నాగ్‌ని కోరాడు ఆర్జీవి. దీనికి నాగార్జున త‌న ట్విట్ట‌ర్‌లో వ‌ర్మ‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ, ఈ రోజుని ఫుల్‌గా ఎంజాయ్ చేయ‌మ‌ని చెప్పారన్నారు.