You are here

మార్తాండ వర్మగా రానా..

భల్లాలదేవ గా అదరగొట్టిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు మహారాజ మార్తాండ వర్మ గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. కేరళలోని ట్రావన్‌కోర్‌ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్‌ మార్తాండ వర్మ జీవితాధారంగా ఓ చిత్రం రాబోతోంది. ఇందులో మార్తాండ వర్మగా రానా నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

అనిళం తిరునాళ్‌ మార్తాండ వర్మ- ది కింగ్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌ చిత్రంతో రాబోతున్నాను. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కె.మధు దర్శకత్వం వహించనున్నారు. రాబిన్‌ తిరుమల కథ అందించారు. అని రానా ట్వీట్‌లోపేర్కొన్నారు.

ఇక నేనె రాజు నేనె మంత్రి సినిమాతో కమర్షియల్ హిట్ కూడా అందుకొని ఆల్ రౌండర్ అని మరోసారి రుజువు చేశాడు.ప్రస్తుతం రానా 1945 చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సత్య శివ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్‌లో రానా పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో రానా శాస్త్రవేత్తగా నటిస్తున్నట్లు చిత్రవర్గాల సమాచారం. రెజీనా కథానాయికగా నటిస్తోంది.

Related Articles