మా ఇద్దరి మధ్య అలాంటి ఎఫైర్‌ లేదు..

Rana Daggubati And Kajal Agarwal love Rumours

టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్, రానా లవ్ లో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్‌ పై ఇప్పటివరకూ ఈ స్టార్ల నుంచి ఎలాంటి స్పందనా లేదు.

అయితే తాజాగా రానా – కాజల్ జంటగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైన సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన కాజల్ వీరి మధ్య వస్తున్న రూమర్ల పై రియాక్ట్‌ అయింది.

Rana Daggubati And Kajal Agarwal love Rumours

రానా, తాను ప్రేమించుకుంటున్నామంటూ వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని, తామిద్దరం చాలాకాలంగా స్నేహితులమని చెప్పింది.

రానా కష్టపడే వ్యక్తి అని, ‘బాహుబలి’ సినిమాతో రానాకు రావాల్సిన గుర్తింపు అతనికి వచ్చిందని తెలిపింది. ఇదిలా ఉండగా..‘బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టారా?’ అనే ప్రశ్నకు కాజల్ జవాబిస్తూ.. టాలీవుడైనా, బాలీవుడైనా తనకు మంచి పాత్ర దొరికితే చేస్తానని, మంచి స్క్రిప్ట్ లభిస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది.