మరో ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో రానా..

Rana Daggubati to play famed Indian wrestler Kodi Rammurthy Naidu in upcoming biopic

బాహుబలి చిత్రంతో ప్రభాస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటుడు దగ్గుపాటి రానా. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. ఈ చిత్రంలో రానా బల్లాలదేవుడిగా నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ మూవీ తర్వాత రానాకు ఆఫర్లు జోరుగా వస్తున్నాయి.

 Rana Daggubati to play famed Indian wrestler Kodi Rammurthy Naidu in upcoming biopic

ఇక బయోపిక్‌ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇటీవల నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ చిత్రంలో నారా చంద్రబాబునాయుడు పాత్ర కోసం రానాను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రానా మరో ప్రతిష్ఠాత్మక బయోపిక్‌ మూవీలో నటిస్తున్నాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

1900 కాలంలో ఐదు వేలకిపైగా మల్లయుద్ధం పోటీల్లో విజేతగా నిలిచి కలియుగ భీమగా పేరు తెచ్చుకున్నాడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’. ఈయన బయోపిక్‌ తెరపై చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో రానా నటించబోతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ బయోపిక్‌కు  సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.