రాజ్యమేలుతున్న జోగేంద్ర..కళ్లు చెదిరే బిజినెస్

Rana Movie amazing pre release business

రానా చేసిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తెలిసిన ప్రేక్షకుల్లో ఇదొక పొలిటికల్ డ్రామా అని, ఎక్కువ పాలిటిక్స్ గురించే ఉంటుందనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ దర్శకుడు తేజ మాట్లాడుతూ ‘ట్రైలర్ లో రాజకీయాలు అనే అంశాన్ని హైలెట్ చేయడం వలన అందరూ ఇదొక పొలిటికల్ సినిమా అనే అనుకుంటున్నారు. కానీ ఇందులో రాజకీయాలు 10 శాతం మాత్రమే ఉంటాయి. దాంతో పాటు రానా – కాజల్ ల లవ్ ట్రాక్ సినిమాకే హైలెట్ గా ఉంటుందన్నారు.

ఇక బాహుబలి తర్వాత రానా నటిస్తున్న సినిమా కావడంతో నేనే రాజు నేనే మంత్రి  ప్రీ రిలీజ్ బిజినెస్ లో భారీ మొత్తాన్ని పలికినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తమిళ, మలయాళ, హిందీ అనువాద హక్కులు, ఆ భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ తో పాటు ప్రీ బిజినెస్ అంతా కలిసి 25 కోట్ల మార్కును రీచ్ అయినట్టు సమాచారం.

రాజకీయం అంటే ఓ చదరంగం. ఎత్తులు పైఎత్తుల్లో ఎంతో తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. అయితే ఆ ఎత్తులు వేయడంలోనే ఒకొక్కరూ ఒక్కో దారిని ఎంచుకొంటుంటారు. మరి జోగేంద్ర ఎంచుకొన్న దారి ఎలాంటిది? ఐదేళ్ల కాలంలో ఆయన జీవితంలో చోటు చేసుకొన్న మార్పులు ఎలాంటివి? రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగాడు? వ్యక్తిగతంగా ఎలాంటి అనుభవాల్ని చవిచూశాడు? తదితర విషయాలు తెలియాలంటే ‘నేనే రాజు నేనే మంత్రి’ చూడాల్సిందే’.