రంగస్థలం…ఆది స్టన్నింగ్ లుక్

Rangasthalam Aadhi First Look

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది. రంగస్ధలంను దృశ్యకావ్యంలా మలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు సుకుమార్‌. 1985 నాటి కాలాన్ని తలపిస్తూ సుకుమార్ తీస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన రామ్‌ చరణ్‌,సమంత ఫస్ట్ లుక్స్‌ అందరిని ఆకట్టుకుంది.

తాజాగా ఆది పినిశెట్టి పాత్రను రీవిల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. చ‌ర‌ణ్‌కి అన్న‌య్య‌గా కె.కుమార్ బాబు పాత్రలో ఆది క‌నిపించ‌నున్నాడు.ఫస్ట్ లుక్‌ పోస్ట‌ర్‌లో ఆది డిఫ‌రెంట్ లుక్‌తో పోస్ట‌ర్‌పై రంగ‌స్థ‌లం గ్రామ పంచాయితీ ఎన్నిక‌ల‌లో ప్రెసిడెంట్ అభ్య‌ర్ధిగా నిలబడ్డట్లు తీర్చిదిద్దారు. కె.కుమార్ బాబు లాంత‌రు గుర్తుకే మీ ఓటు ముద్ర‌ని వేసి గెలిపించండి అని రాసి ఉంది.

ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్‌కు తోడు సాంగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆనాటి కాలాన్ని తలపించేలా ఉన్న సెట్టింగ్స్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు సుకుమార్. టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించేందుకు వస్తున్న రంగస్ధలంతో సుకుమార్ చేసే మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే మార్చి 30 వరకు వేచిచూడాల్సిందే.

Aadhi