అఖిల్ రెండో సినిమా టైటిల్ ఇదేనా !

Rangula Ratnam For Akhil?
Rangula Ratnam For Akhil?

ప్ర‌స్తుతం అఖిల్ సినిమా మ‌నం ఫేమ్ విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి ఎన్నో వార్త‌లు వినిపించాయి. స్క్రిప్ట్ లో కొంత మార్పుల వ‌ల‌న ఈ సినిమా డిలే అవుతుంద‌ని, వ‌చ్చే ఏడాది మూవీ విడుద‌ల అయ్యే ఛాన్స్ ఉంద‌ని పుకార్లు వ‌చ్చాయి. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత, అఖిల్ తండ్రి నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా మూవీ రిలీజ్ డేట్ క‌న్ ఫాం చేశాడు. డిసెంబ‌ర్ 22న మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లీసాల కుమార్తె కల్యాణిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.

Rangula Ratnam For Akhil?

ఇప్పటివరకు ఈ మూవీకి జున్ను, హలో గురూ ప్రేమ కోసమేరా అనే పేర్లు బలంగా వినిపించాయి. తాజాగా ఈ సినిమా టైటిల్‌ ఆసక్తికరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ‘రంగుల రాట్నం’ అనే టైటిల్‌ను నమోదు చేసుకున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జ‌రుగుతుండ‌గా, విక్ర‌మ్- వినోద్ మ‌రోసారి త‌మ మ్యూజిక్ తో అద‌ర‌గొట్ట‌నున్నారు. డిసెంబ‌ర్ అనేది నాగ్ ల‌క్కీ మంత్ కాగా, ఈ సారైన నాగ్ సెంటిమెంట్ అఖిల్ కి క‌లిసి వ‌స్తుందేమో చూడాలి.