రవితేజ గ్రేట్ అంటున్న రాశీ ఖన్నా..

raashi-khanna

అందాల భామ రాశీఖన్నా కూడా స్పెషల్ సాంగ్ లో చిందేయడానికి సై అంటోంది. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’ లో రాశీ ఓ  స్పెషల్ సాంగ్ లో ఆడిపాడబోతున్నానని ట్వీట్టర్ ద్వారా తెలిపింది. పాటతో పాటు గెస్ట్ రోల్ లోనూ కన్పించే అవకాశాలున్నాయని ట్వీట్ చేసింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి కోరిక మేరకు రాశీ ఈ పాత్ర చేస్తోందని టాక్‌.

raashi-khanna

రాజా ది గ్రేట్‌ లో మాస్‌ రాజా అంధుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాతోనే ఆయన కుమారుడు మహాధన్‌ తెరంగేట్రం చేయనున్నాడు. రెండేళ్ల తర్వాత వస్తున్నరవితేజ సినిమాలో మెహ్రీన్‌ పిర్జాదా, ప్రకాష్‌రాజ్‌, రాధికా శరత్‌కుమార్‌ లు నటించనున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ ఫ్యాన్స్ ను అలరిస్తుండగా..ఇప్పుడు రాశీ స్పషల్ సాంగ్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

raashi-khanna

దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో మెహరీన్‌ హీరోయిన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం రాశీ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిన ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.