‘సైరా’లో భోజ్ పూరి యాక్టర్ రవికిషన్..

Ravi Kishan is a baddy in ‘Sye Raa.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేంద‌ర్ రెడ్డి దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘సైరా’ ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ ఓ ముఖ్యపాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. క‌థానాయిక‌గా న‌య‌న‌తార న‌టిస్తుండ‌గా కొణ‌దెల ప్రొడక్ష‌న్ కంపెనీ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వ‌తంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర్సింహ్మారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

 Ravi Kishan is a baddy in ‘Sye Raa.

జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. తాజాగా మ‌రో భోజ్ పూరి న‌టుడు ఈ సినిమాలో చోటు సంపాదించుకున్నాడు. గ‌తంలో తెలుగులో అనేక సినిమాల్లో న‌టించిన ర‌వికిష‌న్ ‘సైరా’లో ఓ పాత్ర‌లో ద‌ర్శ‌నమివ్వనున్నాడ‌ట‌.

ర‌వికిష‌న్ గ‌తంలో రేసుగుర్రం సినిమాలో న‌టించిన త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకోవ‌డంతో సురేంద‌ర్ రెడ్డి మ‌రోసారి త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. కానీ దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఇక చిరంజీవి ఖైదీ 150 చిత్రం త‌ర్వాత ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ఇక సైరా సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి