పవన్‌తో డిమాండింగ్ గా మాట్లాడుతుందట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన కొడుకు అకీరాతో.. కూతురు ఆద్యతో పవన్ కు ఉన్న అనుబంధం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. పవన్ కళ్యాణ్ కు తన కొడుకు అకీరా నందన్ తో అనుబంధం ఎక్కువ అని రేణు చెప్పింది. తమను కలవడానికి పుణెకు వచ్చినపుడల్లా అకీరాతో పవన్ లైఫ్ గురించి.. ఫిలాసఫీ గురించి మాట్లాడతాడని రేణు చెప్పింది. వాళ్లిద్దరూ సినిమాల గురించి మాట్లాడటం తాను చూడలేదని ఆమె అంది. ఇక ఆద్య పవన్ దగ్గర ఎప్పుడూ డిమాండింగ్ గా ఉంటుందని.. ఏ విషయాన్నయినా క్వశ్చన్ చేస్తుందని రేణు చెప్పింది.

Renu Desai Speaks About Pawan

అప్పుడప్పుడూ పవన్ కు ఫోన్ చేసి.. నువ్వెందుకు నాన్నా ఎప్పుడూ అంత బిజీగా ఉంటావు.. నేను నిన్ను మిస్సవుతా కదా అని అడుగుతుందని.. షెడ్యూల్ చూసుకుని వారం రోజుల్లో వస్తానని పవన్ చెబుతాడని.. తర్వాత వీలు చూసుకుని వచ్చి ఒక రోజు ఉండి వెళ్తాడని రేణు చెప్పింది. ఆ సమయాల్లో తాము స్నేహితుల్లా ఉంటామని.. పవన్ భోజనం చేసి.. పిల్లలతో మాట్లాడి వెళ్తాడని రేణు చెప్పింది. అకీరాను హీరోను చేయమని అందరూ అడుగుతున్నారని.. కానీ అతడిని ముందు ఉన్నత చదువులు చదివించాలన్నది తన లక్ష్యమని రేణు చెప్పింది.