రివ్యూ: నా పేరు సూర్య

Review Naa Peru Surya

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం,మలయాళంలో ఏకకాలంలో విడుదలైంది. రచయితగా కెరీర్‌ ప్రారంభించిన వక్కంతం వంశీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత నాగబాబు మరోసారి నిర్మాతగా లగడపాటి శ్రీధర్‌తో సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..అల్లు అర్జున్ మరో హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

సూర్య(అల్లు అర్జున్‌) ఆర్మీ ఆఫీసర్‌. కర్తవ్య నిర్వహణలో కోపంగా ఉండే అర్జున్‌…తన కస్టడీలో ఉన్న ఓ టెర్రరిస్ట్‌ను చంపడంతో ఉద్యోగాన్ని కొల్పోతాడు. ఇదే క్రమంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో ప్రేమలో పడతాడు. అయితే తన ఆవేశంతో ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయ్యే పరిస్ధితి వస్తుంది.. సీన్ కట్ చేస్తే దేశం కోసం చనిపోయేందుకు
సిద్ధమైన సూర్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడా..? ప్రేమలో సక్సెస్ అయ్యాడా-తిరిగి ఉద్యోగంలో చేరాడా లేదా అన్నది తెరపై చూడాల్సిందే.

Review Naa Peru Surya

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ పాయింట్స్ అల్లు అర్జున్ నటన,స్క్రీన్ ప్లే, ఎమోషనల్ సీన్స్,ఇంటర్వెల్‌ సీన్. అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తన స్టైలిష్ లుక్‌,యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో బన్నీ యాక్షన్‌ సూపర్బ్. సినిమాకు మరో హైలెట్ అను ఇమ్మాన్యుయేల్. తన గ్లామర్‌తో సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. హీరో,హీరోయిన్స్‌ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. మిగితా నటీనటుల్లో బొమన్ ఇరానీ,రావు రమేష్,వెన్నెల కిశోర్ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ అంతగా ఆకట్టుకోని కథ. ఫస్టాఫ్ మధ్యలో బొర్ కొట్టిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ బాగుంది.విశాల్ శేఖర్‌ అందించిన సంగీతం,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. నాగబాబు,లగడపాటి శ్రీధర్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. కొటగిరి వెంకటేశ్వర రావ్ అందించిన ఎడిటింగ్ బాగుంది. ఇప్పటివరకు రచయితగా తన డైలాగ్‌లతో ఆకట్టుకున్న వక్కంతం వంశీ…దర్శకుడిగా తన ప్రతిభను చూపించడంలో వందశాతం సక్సెస్ అయ్యాడు.బెస్ట్ మూవీని ప్రేక్షకులకు అందించాడు. ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా ఉండేలా తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాను తెరకెక్కించాడు.

Review Naa Peru Surya

తీర్పు:

నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ప్రతీ సన్నివేశంలో తన మార్క్‌ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. తొలి సినిమా అయిన అలాంటి ఫీలింగ్ ఎక్కడా రానివ్వలేదు. అల్లు అర్జున్ నటన,స్క్రీన్ ప్లే,ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్ కాగా అక్కడక్కడా బొర్ కొట్టించే సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా రచయితగా వంశీకి హీరోగా అల్లు అర్జున్‌కి మంచి మైలేజ్‌ ఇచ్చే…వేసవిలో ఫ్యామిలీతో చూసే మూవీ నా పేరు సూర్య.

విడుదల తేది:04/05/2018
రేటింగ్:3/5
నటీనటులు:అల్లు అర్జున్,అను ఇమ్మాన్యుయేల్
సంగీతం:విశాల్-శేఖర్
నిర్మాత:నాగబాబు,లగడపాటి శ్రీధర్
దర్శకత్వం:వక్కంతం వంశీ