రివ్యూ: సప్తగిరి ఎల్‌ఎల్‌బి

review Sapthagiri LLB

బొమ్మరిల్లు చిత్రంతో కమెడియన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాక్టర్ సప్తగిరి. అనతికాలంలోనే జూనియర్ బ్రహ్మానందంగా పేరు తెచ్చుకున్న సప్తగిరి.. ఎక్స్‌ప్రెస్ స్పీడుతో  తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు కమెడీయన్‌గా అలరించిన సప్తగిరి హీరోగా మారాడు. తొలి ప్రయత్నంలోనే సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా బాలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’గా రిమేక్‌ చేశాడు. చరణ్‌ లక్కాకుల దర్శకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

సప్తగిరి(సప్తగిరి) ఎల్‌ఎల్‌బి చేస్తాడు. ఉర్లో చిన్న చిన్న పంచాయతీలను తెలివితో పరిష్కరిస్తాడు. కానీ, కోర్టులో అడుగుపెడితే ఒక్క కేసూ గెలవలేడు. దీంతో లాయర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టేందుకు పట్నం చేరుకుంటాడు. ఇదే సమయంలో ఓ హిట్‌ అండ్‌ రన్‌ కేసు సప్తగిరిని ఆకర్షిస్తుంది. దాన్ని రాజ్‌పాల్‌(సాయికుమార్‌) వాదించి ఆ కేసును కోర్టులో కొట్టించేస్తాడు. ఆ కేసును తిరగదొడిన సప్తగిరి…కేసు తీర్పు వెలువడే సమయంలో లంచం తీసుకుని తప్పుకుంటాడు..తర్వాత ఏం జరిగింది..?సప్తగిరి కేసును గెలిచాడా లేదా అన్నదే కథ.

Sapthagiri LLB Review & Rating
ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌ సప్తిగిరి డ్యాన్స్‌, సాయి కుమార్, కోర్టు సన్నివేశాలు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా మారిన సప్తగిరి చేసిన రెండో ప్రయత్నం ఇది. డ్యాన్సుల్లో, డైలాగ్‌లు చెప్పటంలో తన ప్రతిభను చూపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. తన ఎమోషన్‌ రెండింటినీ పండించగలిగాడు.  సాయికుమార్ మరోసారి డైలాగ్‌ కింగ్‌ అనిపించుకున్నాడు.  శివ ప్రసాద్‌ నటనా ఆకట్టుకుంది. కథానాయికకు పెద్ద ప్రాధాన్యం లేదు. చివరి 40 నిమిషాల పాటు జరిగే కోర్టు సన్నివేశాలు ఈ సినిమాకు ప్రాణం.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ తెలిసిన కథే కావడం, పాటలు.

 సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. ఇలాంటి కథలను రిమేక్‌ చేయటం చాలా కష్టం. దర్శకుడు దాన్ని చాలా జాగ్రత్తగా డీల్‌ చేశాడు. కోర్టులో జరిగే సన్నివేశాలను సమర్థంగా తెరకెక్కించాడు. కథా గమనానికి పాటలు అడ్డుపడినట్లు అనిపిస్తుంది. సినిమా ఉన్నతంగా తీర్చిదిద్దారు. పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Sapthagiri LLB Review & Rating
తీర్పు:

బాలీవుడ్‌లో విడుదలైన ఘన విజయాన్ని అందుకున్న ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’రిమేక్‌గా తెరకెక్కిన చిత్రం సప్తగిరి ఎల్‌ఎల్‌బి. సప్తగిరి,సాయికుమార్ నటన సినిమాకు ప్లస్ కాగా పాటలు మైనస్ పాయింట్స్. మొత్తంగా ఈమూవీతో మరోసారి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడనే చెప్పాలి.

విడుదల తేదీ:07/12/2017
రేటింగ్: 2.5/5
నటీనటులు: సప్తగిరి, కాశిష్‌ వోహ్రా
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
నిర్మాత: డాక్టర్‌ కె.రవి కిరణ్‌
దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల