పవన్‌పై వర్మ వల్గర్ కామెంట్స్…

RGV Hits Back Pawan Again

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వల్గర్ కామెంట్స్ చేశాడు. రవితేజ నటించిన నేల టిక్కెట్టు ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా పవన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌లో పవన్‌… పక్కనే కూర్చున్న రవితేజపై జోకులు పేల్చాడు. రవి వేసుకున్న జీన్స్‌ ప్యాంట్ రంధ్రంలో వేలు పెట్టి న్యూ ట్రెండ్‌ని ఫాలో అవుతు అంతకుఅంత యంగ్‌ అయిపోతున్నావంటూ సరదాగా వ్యాఖ్యనించారు.

దీనిపై వర్మ తన పైత్యాన్ని జోడించి వివాదాస్పద ట్వీట్స్ చేశారు. పవన్ కళ్యాణ్‌లో ఈ యాంగిల్ కూడా ఉన్నదని ఎక్స్‌ప్రెషన్‌ని బట్టి రవితేజ మొహంలో క్లియర్‌గా తెలుస్తుంది. కానీ ఈ సీక్రెట్ మెగా ఫ్యామిలీకి జనసేన పార్టీకి తెలిసుండదు. బట్ పీకే గిల్లుడులో ‘నేల టిక్కెట్టు’ కనెక్షన్స్ కనిపిస్తున్నాయన్నారు. రవితేజ ఎడమ తొడకి.. పవన్ కళ్యాణ్ కుడి చేతికి ఉన్న అవినవభావసంబంధం ఆ దేవుడికే తెలియాలి.. పీకేకి.. రవితేజ ఎడమ తొడ మీద చాలా మక్కువ ఉందున్న విషయం పీకే మొహంలో ఉన్న ఆనందంలో కనబడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత నీచ కామెంట్సా అంటూ వర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. వీడి చర్యలు ఊహాతీతం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరికొంతమంది ఛీ.. ఛీ..వర్మ మారడు అని మండిపడుతున్నారు. అనిపించేలా ఉన్నాయి.