రిచా…హర్ట్‌ అయినట్టుంది…

Richa Gangopadhyay hurt

తక్కువ కాలంలోనే పెద్ద సినిమాలే చేసింది. మిర్చి , మిరపకాయ్ లాంటి హిట్ ఆమె ఖాతాలో వున్నాయి. ఐతే చదువు కోవడం కోసం ఇండస్ట్రీని వదిలేసింది కూడా.. ఇవన్నీ చేసింది ఎవరోకాదండోయ్  రిచా గంగోపాధ్యాయ్‌.

ఇపుడు చదువు కూడా పుర్తయింది. ఐతే ఇండస్ట్రీ మళ్ళీ వచ్చే ఆలోచన లేదని చెబుతుంది రిచా. అంతేకాదు.. ఇకపై తన అభిప్రాయాలను, భావాలను సోషల్‌ మీడియాలో పంచుకోనని కూడా అంటుంది .

ఇకపై నా అభిప్రాయాలు చెప్పడం, సలహాలు ఇవ్వడం మానేస్తున్నా. ఇది కొన్నేళ్ల క్రితమే చేసి ఉండాల్సింది. నా ఉద్దేశాలు, అభిప్రాయాలు వ్యక్తపరిచి.. విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. 2018 మీ అందరికీ గొప్ప ఏడాది కావాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది రిచా.

ఇటీవలే ఆమె పెళ్లి పై వార్తలు వచ్చాయి. అప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా స్పదించింది రిచా. అప్పట్లో ఆమె విమర్శలు రావడం భాదించినట్లు వుంది. అందుకే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంది రిచా.