సల్మాన్‌తో ఛాన్స్ కొట్టేసిన రీతూ‌..!

Ritu Varma to romance Salmaan..!

పెళ్లి చూపులు సినిమాలో త‌న‌ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న రీతూ వ‌ర్మ త‌ర్వాత సినిమాల ఎంపిక విష‌యంలో చాలా సెల‌క్టివ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.  ప్రేమ-ఇష్క్-కాదల్,నా రాకుమారుడు,ఎవడే సుబ్రమణ్యం చిత్రాల్లో కనిపించిన ఈ భామకు.. పెళ్లి చూపులు మూవీ తర్వాత విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది రీతూ వర్మ.

పెళ్లి చూపులు తర్వాత నిఖిల్‌తో కేశవ సినిమాలో నటించిన  ఈ బ్యూటీ గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ స‌ర‌స‌న `ధ్రువ‌న‌క్ష‌త్రం` సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా పట్టాలపై ఉండగానే మరో ఛాన్స్ కొట్టేసింది. ఓకే బంగారం సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

ఈ  సినిమాకు దేశింగ్ పెరియ‌సామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. డైరెక్టర్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేసిందట ఈ బ్యూటీ. మొత్తానికి భాషతో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది రీతూ వర్మ.