ఆ ఆడియోకి అన్ని కోట్లా..!

ROBO 2.0 Audio worth 10 crores

శంకర్-రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.0’.ఆడియో వేడుక కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ వేడుకను దుబాయిలో నిర్వహించబోతున్నట్లు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేదికను కూడా వెల్లడించారు. దుబాయిలోని ప్రసిద్ధ బుర్జ్ ఖలీఫా టవర్స్ ప్రాంగణంలోని బుర్జ్ పార్కులో అక్టోబరు 27న ‘2.0’ ఆడియో వేడుక చేయబోతుండటం విశేషం. ఆ పార్కులో వేడుక చేయడం కోసం అద్దె కిందే కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారట.

ROBO 2.0 Audio worth 10 crores

ఇక ఇండియా నుంచి ఈ వేడుక కోసం అతిథుల్ని సొంత విమానాల్లో తీసుకెళ్లి తీసుకు రావడం కోసం కూడా భారీగానే ఖర్చవుతోంది. ఆడియో వేడుక రోజు ఎ.ఆర్.రెహమాన్ తన బృందంతో కలిసి ప్రత్యేక ప్రదర్శన కూడా ఇవ్వనున్నాడు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన కొందరు అతిరథ మహారథుల్ని ఈ వేడుకకు తీసుకెళ్తారని సమాచారం. అతిథులందరికీ బుర్జ్ ఖలీఫాలోనే బస కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ ఆడియో వేడుక ఇండియన్ సినిమానే కాదు.. ప్రపంచ సినిమా దృష్టిని కూడా ఆకర్షించడం ఖాయం. ఇక ‘2.0’ టీజర్ ను నవంబర్‌ హైదరాబాద్ వేదికగా లాంచ్ చేసి డిసెంబర్‌లో చెన్నైలో ట్రైలర్ రిలీజ్ చేస్తారు.