సాహో స్టోరీ లీకైంది..?

'Saaho' has Completed the First Schedule

హీరో ప్రభాస్ బాహుబలి ఘన విజయం తరువాత ‘సాహో’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాని యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్‌ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

'Saaho' has Completed the First Schedule

అయితే ఈ స్టోరీ పునర్జన్మ నేపథ్యంలో కొనసాగుతుందనే టాక్ ఫిల్మ్ వర్గాల సమాచారం. బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలోను .. స్వాతంత్య్రం వచ్చిన తరువాత .. ఇలా రెండు వేర్వేరు కాలాల్లో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. బ్రిటీష్ వారి కాలంలో షూటింగ్ చేయవలసి రావడం వల్లనే, భారీ బడ్జెట్ అవుతుందని అంటున్నారు. యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్న సాహో సినిమాను డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. సుమారుగా 200 కోట్లు బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హింది, మలయాళంలో విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది.