You are here
పాపం… వేశ్యగా మారిన సదా..! గాసిప్స్ టాప్ స్టోరీస్ తాజా వార్తలు సినిమా 

పాపం… వేశ్యగా మారిన సదా..!

వెళ్లవయ్యా వెళ్లు అంటూ దశాబ్దన్నర క్రితం టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకొచ్చిన సదా.. ఇప్పటికీ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది. అయితే అమ్మడికి సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో కనిపించిన సదా.. ఇప్పుడు ఏడాదికి ఒక సినిమాలో నటించడం కూడా కష్టమైపోయింది. అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు, రియాలిటీ షోలలో జడ్జిగా కనిపిస్తూ ఏదోలా కెరీర్ బండిని లాక్కొస్తున్న ఈ ముదురు భామకు రీసెంట్‌గా కోలీవుడ్‌లో చాన్స్ రావడం విశేషం. దర్శకుడు మాజిద్ తెరకెక్కించబోయే ‘టార్చ్ లైట్’ సినిమాలో సదాకు అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రంలో అమ్మడిది వేశ్య పాత్ర అని తెలుస్తోంది.

Sadha

ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అబ్దుల్ మజీద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఏ అమ్మాయి అయినా కోరి పడుపు వృత్తికి దిగదన్నారు. పరిస్థితుల ప్రభావం, మోసాలకు గురయ్యో ఆ వృత్తిలోకి నెట్టబడతారన్నారు. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహనను కలిగించే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం టార్చ్‌లైట్‌ అని చెప్పారు. ఈ పాత్రలో నటించడానికి సదా ముందుకు రావడం సంతోషం కలిగిస్తోందని, కథను చాలా మంది హీరోయిన్లకు వినిపించామని కానీ ఎవరూ ముందుకు రాలేదని సదా మాత్రం ఇలాంటి కథా చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని, తాను తప్పకుండా నటిస్తానని అన్నారని తెలిపారు.

hot sada

సదా వేశ్యగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ టార్చ్‌లైట్‌ చిత్రంలో ఉదయ్‌ అనే నూతన నటుడు హీరోగానూ అతనికి జంటగా రిత్విక హీరోయిన్‌గానూ నటిస్తోందని చెప్పారు.

Related Articles