సాయి ధ‌రమ్ తేజ్ ‘చిత్ర‌ల‌హ‌రి'(బార్ అండ్ రెస్టారెంట్)

Sai Dharam Teja

సుప్రీమ్ హీరో సాయి ధ‌రమ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. ఈసినిమా జూన్ 6వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన ఈమూవీలో తేజ్ స‌ర‌స‌న హీరోయిన్ గా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌రన్ న‌టించింది. వ‌రుస ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మవుతోన్న తేజ్ ఈసినిమాపై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ క‌రుణాక‌ర‌ణ్ ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా…ఎస్ వి రామారావు నిర్మాత‌గా వ్య‌వ‌హిరంచారు.

Tej I Love uఇక తేజ్ త‌ర్వాతి చిత్రం ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌తో చేయ‌నున్నాడు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశాడు కిషోర్ తిరుమ‌ల. తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత ఈమూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. అంద‌మైన ల‌వ్ స్టోరీలు తీసి హీరో రామ్ కెరీర్ లో స‌రైన హిట్ ల‌ను అందించాడు కిషోర్ తిరుమ‌ల‌. కిషోర్ తిరుమ‌ల తీసిన నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒకటే జింద‌గి సినిమాలు మంచి విజ‌యాన్ని అందించాయి.

tej, kishore tirumala

తాజ‌గాసాయి ధ‌రమ్ తేజ్ తో కిషోర్ తిరుమ‌ల తీయ‌నున్న సినిమాకు టైటిల్ ను ఖార‌రు చేశారు చిత్ర బృందం. చిత్ర‌ల‌హరి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈటైటిల్ కు చ‌క్క‌టి ట్యాగ్ లైన్ ను కూడా జోడిచేశారు. బార్ అండ్ రెస్టారెంట్ అనే మాస్ ట్యాగ్ లైన్ మ‌రింత మ‌సాలా రుద్దారు. జులై రెండ‌వ వారం నుంచి ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. యూత్ కు క‌నెక్ట్ అయ్యేలా ఈ క‌థ‌ను సిద్దం చేశాను అన్నారు డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌. ఇక జులై 6న త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోబుతున్నాడు తేజ్.