వరుణ్ తేజ్ ….ఇంటలిజెంట్..!

sai dharam - varun tej movie started

వరుస ఫ్లాప్‌లతో సతమవతమవుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్…స్టార్ డైరెక్టర్ వినాయక్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తిక్క, విన్నర్, నక్షత్రం   హ్యాట్రిక్ ఫ్లాప్‌లను మిగల్చడంతో డీలా పడ్డ తేజు… వినాయక్‌ నమ్ముకుని సినిమాను ఒప్పుకున్నాడు. మెగాస్టార్‌తో ఖైదీ నెంబర్ 150వంటి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న వినాయక్‌ ఈ మెగా హీరోకి బ్రేక్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.

ఈ సినిమా ఇవాళ మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా  దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేసి, సాయిధరమ్‌కు ఆశీస్సులు అందజేశారు చిరు.ఇటీవలే నందమూరి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో సినిమా మొదలుపెట్టిన సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే అధికారికంగా తెలపనున్నారు.  ఈ చిత్రానికి సంబంధించి సరికొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకుముందు ‘దుర్గ’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్ర ప్రారంభోత్సవం ముంగిట ‘ఇంటలిజెంట్’ అంటూ మరో ఆసక్తికర పేరు వినిపిస్తోంది. ఇదే ఫైనల్ కావచ్చని కూడా అంటున్నారు.